Magazines

మనసు ప్రశాంతంగా ఉండాలంటే..?

1 గంట క్రితం

mind peaceful
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

నేటి ఆధునిక యుగంలో శారీరకంగా కన్నా.. మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయాయి. చదువు, వృత్తి, వ్యాపారం, కుటుంబం, బంధాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడం కూడా కష్టంగా మారింది. అందుకే ఈ పరిస్థితి రాకముందే మేల్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగా బలంగా ఉండేందుకు, ప్రశాంత జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయమంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సలహాలు పాటించమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం...

బాధను పంచుకోండి: బాధలు, ఒత్తిళ్లు.. మనసును కకావికలం చేస్తుంటాయి. వాటిని ఒంటరిగా ఎదుర్కోవాలంటే కష్టమే. అయితే దీని నుంచి బయటపడాలంటే నచ్చిన వ్యక్తుల సాయం తీసుకోవాలి. వారితో మీ మనసులోని మాటలను, బాధలను షేర్​ చేసుకోవాలి. అయితే బాధలు పంచుకున్నంత మాత్రాన సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ, మనసు తేలికపడుతుంది. వారు ఇచ్చే మద్దతు, సలహాలు, సూచనలు మానసిక ప్రశాంతతకు ఉపయోగపతాయి.

ధ్యానం: మెడిటేషన్ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావం పడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, మానసిక స్థిరత్వాన్ని పెంచడానికి, ప్రశాంతమైన నిద్రకు ఎంతగానో తోడ్పడుతుంది. శారీరక విశ్రాంతితో పాటు సానుకూల ఆలోచనలను పెంపొందించడం ద్వారా ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి కూడా ధ్యానం అద్భుతంగా సహాయపడుతుంది.

దృఢంగా ఉండండి: శరీరం ఫిట్‌గా ఉంటే.. మానసికంగానూ ఫిట్‌గా ఉంటారు. అందుకే, ప్రతిరోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, సరిపడా నీరు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి అలవాటుగా మార్చుకోవాలి.

మంచి నిద్ర: నిద్రలేమి శరీరం పైనే కాదు.. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిద్ర సరిగా లేకపోతే శరీరం నిస్సత్తువుగా మారిపోతుంది, తొందరగా అలసట వచ్చేస్తుంది. అలాగే ఏకాగ్రత లోపి స్తుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. నేషనల్​ ఇన్​స్టి ట్యూట్​ ఆఫ్​ హెల్త్ కూడా ఈ విషయాన్ని వెల్లడిం చింది.​ అందుకే, రోజుకి కనీసం 8 గంటల నాణ్య మైన నిద్ర తప్పనిసరి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకో వాలి. అలాగే పడుకొని మొబైల్‌ చూడొద్దు.. నిద్రకు ఉపక్రమించే ముందే మొబైల్‌ను దూరంగా పెట్టాలి.

కొత్తగా ట్రై చేయండి: రోజువారీ పనులు ఎలాగూ తప్పవు. అందుకే అప్పుడప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్నవాటిలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి. డ్యాన్స్‌, స్పోర్ట్స్‌, ఆర్ట్స్‌ క్లాసుల్లో చేరడం వల్ల మీలో దాగిఉన్న టాలెంట్​ బయటికి వస్తుంది. దీని వల్ల రోజువారి పనుల నుంచి కాస్త రిలాక్సేషన్​ దొరికే అవకాశం ఉంటుంది.

ప్రకృతిలో గడపండి: ప్రకృతికి మించిన మానసిక వైద్యులు లేరంటే అతిశయోక్తి కాదు. పచ్చని చెట్ల మధ్య సేద తీరితే ఒత్తిడి తగ్గి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఉద్యానవనానికి వెళ్లమని సలహా ఇస్తున్నారు నిపుణులు. లేదంటే పచ్చని మొక్కల మధ్య కాసేపు వాకింగ్​ చేయడం, పాటలు వినడం వంటివి చేసినారిలాక్సేషన్​ లభిస్తుంది.

సహాయం చేయండి: ఇతరులకు సాయం చేయడంలో లభించే సంతృప్తి.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే అందుకు పెద్ద పెద్ద సాయం అక్కర్లేదు, ఎంతో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వొచ్చు. అలాగే ఆయా సంస్థలకు వాలంటీర్‌గా పనిచేయొచ్చు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మద్దతుగా నిలవడం, సోషల్‌మీడియాలో ఏదైనా మంచి విషయం మీ దృష్టికి వస్తే వాటిని షేర్‌ చేయడం, ప్రోత్సహించేలా కామెంట్‌ చేయడం వంటివి కూడా సంతోషాన్ని కలిగిస్తాయి.

వర్తమానంలో జీవించండి: మనుషులు ఒత్తిడికి గురికావడానికి ముఖ్య కారణాల్లో అతిగా ఆలోచించడం ఒకటి. గతం గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తుపై ఆందోళనతో మానసికంగా కుంగిపోతుంటారు. వాటి గురించి ఆలోచించడం మానేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వర్తమానం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైనే దృష్టిపెట్టాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్