పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి మందడి నరసింహారెడ్డి

– నరసింహారెడ్డి ప్రధమ వర్ధంతి సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి
నవతెలంగాణ – చండూరు
పేద ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ,వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి, అమరుడు మందడి నరసింహారెడ్డి అని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మందడి నరసింహారెడ్డి ప్రధమ వర్ధంతి ని పురస్కరించుకొని చండూరు మండల కేంద్రంలోని గుండ్రపల్లి కూడలిలో ఉన్న నర్సింహారెడ్డి స్మారక స్థూపానికి  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చండూర్ నుండి పుల్లెంల వరకు బైక్ ర్యాలీగా వెళ్లి పుల్లెంల గ్రామంలో మందడి నరసింహారెడ్డి విగ్రహానికి పల్లా వెంకట్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతి సంతాప సభలో పల్లా వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ మందడి నరసింహారెడ్డి గత సంవత్సరం ఫిబ్రవరి 1న గుండెపోటుతో మరణించడం బాధాకరమైన విషయమని అన్నారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండల  భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. మునుగోడు నియోజకవర్గానికి సాగు త్రాగునీరు అందించాలని నక్కల గండి ప్రాజెక్టు సాధన కోసం అలు పెరుగని పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు . చండూరు మండలంలో నిరు పేదలకు ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని అనేక ప్రజా పోరాటాలలో క్రియాశీలక  పాత్ర పోషించారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ రెండుసార్లు పుల్లెంల  ఎంపీటీసీగా గెలుపొంది  కొనసాగి మండల ప్రజలకు సేవలు అందించారని అన్నారు. చండూరు మండల పేద ప్రజలకు నోట్లో నాలుకగా మెలుగుతూ, ప్రజాసమస్యలే తమ సమస్యలుగా భావించి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకున్న అమరుడు ముందడి నరసింహారెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య,ఆర్ అంజా చారి, తిరుపారి వెంకటేశ్వర్లు, బొల్గూరి  నరసింహ, గురుజ రామచంద్రం, బచ్చనాగోని గాలయ్య,కురిమిద్దె శ్రీనివాస్, గిరి రామ, సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, బొడ్డు వెంకటేశ్వర్లు, పల్లె యాదయ్య, పి హెచ్ ఉషయ్య, ఎండి  కరీం, శివర్ల లింగస్వామి, దోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love