నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ బీజేపీకి ఏజెంట్‌గా మారారని కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మెన్, వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.వికలాంగుల జాతిని బీజేపీకి తాకట్టు పెట్టొద్దని కోరారు. సోదరి రజినీకి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఉద్యోగాన్ని కించపర్చడం అనైతికమని విమర్శించారు. వికలాంగులను ప్రభుత్వానికి వ్యతిరేకం చేయటమే మంద కృష్ణ ఉద్దేశమని తెలిపారు. దీని వల్ల మీరు లబ్దిపొంది, వారికి నష్టం చేయాలనుకుంటున్నారా? అని ఆయన్ను ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం వికలాంగులను వాడుకోవద్దని సూచించారు. చిత్తశుద్ధితో ధర్నా చేయాలనుకుంటే..కిషన్‌రెడ్డి ఇంటి ముందు చేయాలని కోరారు. అంతే తప్ప వికలాంగుల మధ్య చిచ్చుపెట్టొద్దని మందకృష్ణకు ముత్తినేని సూచించారు.