కాంగ్రెస్ పార్టీ యూత్ మీటింగ్ కు కదిలిన మండల నాయకులు 

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కె గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ యూత్ సమావేశానికి యూత్ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదుద్దిల్ల శ్రీధర్ బాబు తమ్ముడు దుద్దిల్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మండలం లోని బేగంపేట గ్రామానికి చెందిన దాసరి శివ, ఆదివారం పేట గ్రామానికి చెందిన గోడిసెల సంతోష్,  కన్నూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love