అటవీ శాఖలో పలువురి బదిలీలు..

Many transfers in the forest department.నవతెలంగాణ – డిచ్ పల్లి
అటవీ శాఖలో పలువురు సెక్షన్, బిట్ అధికారులు బదిలైనట్లు ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధర్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు నిర్వహించిన ఆసిఫ్ ఉద్దీన్ హైదరాబాద్ లోని విజిలెన్స్ కు బదిలీ అయ్యారు. యానంపల్లి సెక్షన్ అధికారిగా ఉన్న పి బాపురావు కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని కోనాపూర్ కు, సుబ్బారావు జాతీయ రహదారి నుండి కొడిమ్యాల రేంజ్ పరిధిలోని గోవింద్ రం కు, ఆనంద్ నాయక్ అమ్సన్ పల్లి నుండి కడెం రేంజ్ పరిధిలోని గంగాపూర్ కు, సురేందర్ నుండి పరిధిలోని ఇస్లాంపూర్ కు బదిలీపై వెళ్లారు. వీరితో పాటు ఐదుగురు బీట్ అధికారులు బదిలీనట్లు రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వివరించారు.పవన్ కుమార్ ఇందల్ వాయి రేంజ్ నుండి కమ్మర్పల్లి రేంజ్ కు, టి వినోద్ కుమార్ కోరట్ పల్లి నుండి వర్ని రేంజ్ కు, టీ హైందవరాణి పడకల్ నుండి కమ్మరపల్లి రేంజ్ కు, బి శిరీష ఓన్నజి పేట్ నుండి కమ్మరిపల్లికు, శ్రీకాంత్ సికింద్రాపుర్ నుండి రావుట్ల సిరికొండ మండలానికి బదిలీపై వెళ్లరు. ఇదే కాకుండా సీనియర్ అసిస్టెంట్ గా వీధులను నిర్వచించిన ఎస్ నాగరాణి ఇందల్వాయి నుండి నిజామాబాద్ లోని నార్త్ రేంజ్ కు బదిలీ కాగా, నార్త్ రేంజ్ లో విధులు నిర్వహిస్తున్న సుమలత ఇందల్వాయ్ రేంజ్ సీనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు సెక్షన్ అధికార్ల బాధ్యతల స్వీకరణ.. ఖాళీ అయిన సెక్షన్ అధికారుల స్తానంకు బదులు ముగ్గురితో భర్తీ చేయనున్నారు. కమ్మర్పల్లి రేంజ్ లో విధులు నిర్వహిస్తున్న శిక్షణ అధికారి తుకారాం రాథోడ్ డిప్యూటీ రేంజ్ అధికారి ధర్పల్లి సెక్షన్ అధికారిగా వీధుల్లో చేరనున్నారు. ఆర్మూర్ రేంజ్ నుండి శ్రీకాంత్ యానంపల్లి సెక్షన్ అధికారిగా, నిజామాబాద్ నార్త్ లో విధులు నిర్వహిస్తున్న భాస్కర్ ఓన్నజిపేట్ సెక్షన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి రవి మోహన్ బట్ మాట్లాడుతూ నిర్వహణలో అంకితభావంతో బదిలీపై వెళ్లినవారు పని చేశారని వారు చేసిన కృషి మరువలేనిది అన్నారు ఉద్యోగరీత్యా బదిలీలు సహజమని ఎక్కడికి వెళ్లినా మనస్ఫూర్తిగా వీధులు నిర్వహించే విధంగా చూసుకుంటూ ఉన్నతాధికారుల మనసును చురకొనే విధంగా చూడాలని బదిలీ అయిన వారిని కోరారు.
Spread the love