న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐఎల్) తన కొత్త, పాత కార్ల కొనుగోలుదారులకు రుణ సౌకర్యాన్ని అందించడానికి హీరో ఫిన్‌కార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ, హీరో ఫిన్‌కార్ప్ ఎండీ, సీఈఓ అభిమన్యు ముంజల్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీంతో మారుతి సుజుకీ 40 కంటే ఎక్కువ రిటైల్ ఫైనాన్స్ భాగస్వాములకు విస్తరించినట్టయ్యింది. హీరో పిన్‌తో జట్టు కట్టడం ద్వారా వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా వారికి విస్తృత శ్రేణి ఫైనాన్స్ ఎంపికలు లభిస్తాయని ఎంఎస్‌ఐఎల్ పేర్కొంది.