నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామ శాఖ పరిధిలో మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులను రాజగోపాల్ రెడ్డి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ తాజా మాజీ సర్పంచ్ బక్క శ్రీనాధ్ గ్రామ శాఖ అధ్యక్షులు తీగుళ్ల చంద్రయ్య మండల ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి ప్రధాన కార్యదర్శి తీగుళ్ల రాఘవేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దీప అంజిరెడ్డి గౌలికర్ ప్రభాకర్ పాప గళ్ళ మహేష్ షేక్ అమీర్ చిన్నబోయిన బిక్షం తిగుళ్ల రాజు తిగుళ్ల ప్రవీణ్ లక్ష్మీనారాయణ భీమనబోయిన శ్రీశైలం తిగుళ్ల శ్రవణ్ తీగుళ్ల లింగస్వామి బాబు నరసింహ తోట మల్లయ్య బుడ్డ సత్యనారాయణ బుడ్డ చలమంద షరీఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు .