మెడ్ సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ మెడికల్ క్యాంపు..

– ఆరోగ్యమే మహాభాగ్యం, మెడికల్ క్యాంపును గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గురువారం, గ్రామ పంచాయతీ ఆవరణంలో మెడ్ సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య  ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కర్రే విజయ వీరయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఆరోగ్యమే మహాభాగ్యం అని గ్రామములో ఉన్న ప్రజలందరూ ఈ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. గ్రామంలోని ప్రజలు డాక్టర్లు చెప్పిన సలహాలు, సూచనలు తప్పక పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఊరిని పూర్తి ఆరోగ్యవంతమైన గ్రామంగా ఉండాలని గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దస్తగిరి, భవిత, అక్షయ, బాబుగౌడ్, సురేష్, రఘు, దుద్దురు వెంకటేష్, గుజ్జ ఉపేందర్, శిఖ బిక్షపతి, కర్రె చంద్రశేఖర్, శిఖ శ్రీకాంత్, రాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love