నవతెలంగాణ – రాయపోల్
మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దానిలో భాగంగానే గతంలో జరిగిన సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని రేపు రాబోయే పార్లమెంటు ఫలితాలలో కూడా మెదక్ నియోజకవర్గం నుంచి నీలం మధు ముదిరాజ్ ను గెలిపించడం జరుగుతుందన్నారు. సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగిందని మాకు విశ్వాసంయ సమాచారం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పాలన చేపట్టడం జరిగిందని అన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల మెప్పు పొందడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థితిగతులనే మార్చుతున్నారని ప్రజలు విశ్వసించారు. గత బిఆర్ఎస్ పాలనకు విసుకు చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందని త్వరలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మెదక్ నియోజకవర్గంలో నీలం మధు ఎన్నో సామాజిక ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టారని అతని సేవా కార్యక్రమాలు గెలుపుకు తోడ్పడతాయన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీలకే ప్రజలు పాలించే అధికారం కట్టబెడతారని,అది ఇటీవల రాష్ట్రంలో రుజువైందన్నారు. బిజెపి పార్టీ మతం దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ప్రజాస్వామ్య దేశంలో మతం దేవుడు కులం పేరు మీద రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు. మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు.