జీతాలు ఇప్పించాలని మెడికల్ కళాశాల సిబ్బంది ధర్నా 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
పెండింగ్లో ఉన్న వేతనాలు ఇప్పించాలని కోరుతూ నల్లగొండ మెడికల్ కళాశాల శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది సోమవారం మెడికల్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సాయి సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నల్గొండ మెడికల్ కళాశాలలో శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. గత 2019 నుండి ఎనాడు జీతాలు, పిఎఫ్ లు  సక్రమంగా చెల్లించలేదని ఆరోపించారు. కేవలం రూ. 5000 జీతం చెల్లిస్తున్నారని తెలిపారు.2024 మార్చి 20వ తేదీన ఎ1 ఏజెన్సీ కి అప్పటి కలెక్టర్  హరిచందన తాత్కాలికంగా అలట్ చేయడంతో మార్చి నెల జీతం రూ. 11500 వేశారని తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ నెల నుండి నేటి వరకు ఏజెన్సీ వారు జీతాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే  జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లిన ఏజెన్సీ నిర్వాహకులు మంత్రి, కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని పెండింగ్ వేతనాలను ఇప్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించే విధంగా  చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాజు, అండాలు, మంగమ్మ, విజయ, లక్ష్మి, చంద్రమ్మ, కరుణ, స్వర్ణ, రజిత, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Spread the love