హైదరాబాద్ : ఇ-కామర్స్ వేదిక మీషో దేశంలోని లక్షలాది మంది కొత్త విక్రేతలకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆన్‌లైన్‌లో హద్దులు లేని అవకాశాలు అందించడానికి జిఎస్‌టియేతర విక్రేతల కోసం ప్లాట్‌ఫామ్‌ను రూపొందిం చామని.. 2023 అక్టోబర్ 1 నుంచి విక్రయాలను ప్రారంభించుకోవచ్చని పేర్కొంది. ఇ-కామర్స్ సంస్థలు ఇటీవల జిఎస్‌టి కౌన్సిల్‌కు చేసిన వినతితో ఇప్పుడు రూ.40 లక్షల వరకు టర్నోవర్ కలిగిన సంస్థలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 2027 నాటికి కోటి మంది అమ్మకందారులను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మీషో తెలిపింది.