ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని కొడిశెల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కూల్ టీచర్లు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తోలెం దేవదాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నారు. మండలంలోని కాకుండా జిల్లా స్థాయిలో కొడిశల బాలల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ముందుండాలన్నారు. ప్రతి ఒక్కరికి 10/10 జీపీఏ సాధించి భవిష్యత్తులో చిన్నతస్థాయికి రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో ఏఐ టెక్నాలజీతో విద్యార్థులకు బోధించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండాలని, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పాఠశాలల్లో వివిధ తరగతుల వారిచే సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో రవీందర్, జగపతిరావు, దేవుల, యలం ఆదినారాయణ, చుక్కారావు, అశోక్, సాంబయ్య, భాస్కర్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, ఏఎన్ఎం సంధ్యారాణి, డిప్యూటీ వార్డెన్ చందా కోటేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.