నూతన జిల్లా కమిటీ సమావేశం..

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ  సమావేశానికి  నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొండ్రపల్లి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరెల్ల యాదగిరి హాజరై నూతన కమిటీను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా పి.రమేష్, అధ్యక్షులుగా రాజెల్ల, ఉపాధ్యక్షులుగా సిహెచ్‌ శాంత, ప్రధాన ఆకర్యద్రశిగా సంతోష, కార్యవర్గ సభ్యులుగా మరో ఆరుగురిని ఎన్నుకున్నారు.   ఈ కార్యక్రమంలో ప్రవీణ్, రాహుల్, సునిత, శోభారాణి,సుశీల, కవిత ఉన్నారు.
Spread the love