తెలంగాణ రాష్ట్ర ఆరెకటికల మహాసభకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి ఆరెకటికల వ్యవస్థాపక సభ్యులు మిర్యాల్కర్ వినోద్, కూనికర్ శ్రీధర్,ధరమ్కర్ సాండురవి,ఆంకార్ నిఖిల్,న్యాంతబాద్ రాజు,గాజీబిన్ కార్ శ్రావణ్,న్యాంతబాద్ రాజు, కసాఫ్ గల్లి నరేష్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆరే కటిక సామాజికంగా, రాజకీయంగా ఉపాధి అవకాశాలు లేక కొట్టిమిట్టాడుతున్నా తరుణంలో కుల బంధువల సమస్యల పరిష్కారానికై చర్యల గురించి మనం చేసే పోరాటల్లో పరస్పర మద్దతు చేసుకుంటూ కుల అభివృద్ధికి దోహదపడుదాం అనే సంకల్పంతో ఆరె కటిక యువసేన – నిజామాబాద్. (కసాబ్ గల్లి ఛ రాజా గణేష్ ఉత్సవ సమితి) ఆధ్వర్యంలో ముందుంటూ సభకు వెళ్లినట్లు తెలిపారు.