మీని మేడారం జాతర అభివృద్ధి పనులు ఆదివాసులకు కేటాయించాలి..

Meni Medaram Jatara development work should be allotted to tribals..– గిరిజన అభ్యుదయ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ముద్దబోయిన రవి 

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లాలో ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకుంటున్న మేడారం సమ్మక్క- సారలమ్మ, మినీ మేడారం జాతర భక్తుల సౌకర్యార్థం కొరకు ప్రభుత్వం సబ్ ప్లాన్ బడ్జెట్ నిధులు మంజూరు చేస్తుంది. ఈ పనులు స్థానిక ఆదివాసి గిరిజనులకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ములుగు గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షులు ముద్దుబిడ్డ రవి డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి, గిరిజనేతర గుత్తేదారులు కాంట్రాక్టర్లు ఆదివాసి నిరుద్యోగ యువకులకు ఆదివాసి సంఘాలకు పనులు దక్కకుండా ఇంజనీరింగ్ అధికారులకు డబ్బులు ఇస్తూ ఏజెన్సీలో అమాయక ఆదివాసులను ఇంకా వెనుకబాటుకు గురి చేస్తూన్నారని మండిపడ్డారు. ఈ గుత్తేదారులు ఆదివాసీలను అణచివేస్తున్నారని ములుగు జిల్లా గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు రవి ఆరోపించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గత ఫిబ్రవరి నెలలో జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులు ఆదివాసులకు ఇవ్వాలని పలు దరఖాస్తులు పెట్టిన కూడా ఇంజనీరింగ్ అధికారులు గుప్తదారులు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోతూ ఆదివాసి సంఘాలను మోసం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశామన్నారు. ప్రభుత్వాలు మారిన ఇంజనీరింగ్ అధికారులు మారటం లేదని, మార్పు రావటం లేదని తెలియజేశారు.
పంచాయతీరాజ్ శాఖ గౌరవ మంత్రి సీతక్క గారు చొరవ తీసుకొని ఏజెన్సీలో అభివృద్ధి పనులు ఆదివాసి కాంట్రాక్టర్లకు, ఆదివాసి నిరుద్యోగ యువకులకు, ఆదివాసీ ప్రజాసంఘాల కు పనులు కేటాయించి ఉపాధి కల్పించాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. మినీ మేడారం జాతరకు శాశ్వత పనుల, అభివృద్ధి పనులు స్థానిక ఆదివాసి నిరుద్యోగ యువకులకు ములుగు జిల్లా నిరుద్యోగ ప్రజా సంఘాలకు అభివృద్ధి పనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనియెడల మరొకసారి తెలంగాణ హైకోర్టులో కేసు నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. ఏజెన్సీలో ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోకుండా వెనుకబడిన అట్టడుగు ఆదివాసులకు పనులు కల్పించాలని, ఆర్థికంగా సామాజికంగా వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన మేడారం మహా జాతరలో ఏటూర్ నాగారం ఐటీడీలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఎరుకల లక్ష్మణ్ అనే వ్యక్తికి 40 లక్షలు పనులు,  సంతసేవలాల్ గిరిజన సొసైటీకి 70 లక్షలు పనులు అప్పగించి, ఆదివాసి కాంట్రాక్టర్లను ఆదివాసి సంఘాలను మోసం చేశారని అన్నారు. ఇకనైనా ఐటీడీఏ అధికారులు గిరిజనులను అభివృద్ధి చేయటానికి కానీ, ఆదివాసీలను మోసం చేయటానికి కాదు అని తెలిపారు. ఆదివాసుల కోసం పనిచేయండి అంతేకానీ గిరిజనేతర కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులకు పర్సంటేజీలకు అమ్ముడుపోకండి అని ఎద్దేవ చేశారు. ప్రభుత్వాలు మారిన, ప్రభుత్వ అధికారులు మారటం లేదు. ఆదివాసి సంఘాలు గమనిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక రోజున ఉద్యమం మొదలైతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని చెప్పారు.
Spread the love