మెస్‌ బిల్లులు, ఫీజు బకాయిలు విడుదల చేయాలి

– ఫైనాన్షియల్‌ సెక్రెటరీని వెంటనే తొలగించాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్‌
పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్‌ మెస్‌ చార్జీలు చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్షియల్‌ సెక్రెటరీ రామకష్ణను వెంటనే తొలగిం చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్‌ బీసీ భవన్‌ వద్ద హాస్టల్‌ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎంపీ ఆర్‌ కష్ణయ్య హాజరై మాట్లాడుతూ. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం ముగిసిందని.. కేటాయించిన బడ్జెట్‌ లాప్స్‌ అవుతుంద న్నారు. గత పది నెలల హాస్టల్‌ మెస్‌ బిల్లులు మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం తో విద్యార్థుల అష్ట కష్టాలు పడుతున్నారన్నారని తెలిపారు. వెంటనే బడ్జెట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ హాస్టల్‌ మెస్‌ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లకు సప్లై చేసే నిత్యవసర సరుకులు వ్యాపారస్తులు ఆపివేశారని దాంతో హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 700 బీసీ, 1500 ఎస్సీ ఎస్టీ హాస్టల్లో నివసించే 8 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవని.. వాటన్నిటికి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హాస్టల్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని, బడ్జెట్‌ విడుదల చేయాలని కోరారు. హాస్టల్‌ మెస్‌ ఛార్జీలు చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్షియల్‌ సెక్రెటరీ రామకష్ణను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కష్ణ, నీలా వెంకటేష్‌, నందగోపాల్‌, రాజ్‌ కుమార్‌, జీలపల్లి అంజి, భాస్కర్‌ ప్రజాపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love