ముంబయి : ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం మ్యూచువల్ ఫండ్‌ల్లో పెట్టుబ డులు 75 శాతం తగ్గి రూ.60,363 కోట్లకు పరిమితమయ్యాయి. ఇంత క్రితం అక్టోబర్‌లో ఏకంగా రూ.2.39 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. గడిచిన నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిధుల రాక 14 శాతం తగ్గగా.. రుణ పండ్లలో ఏకంగా 92 శాతం పతనం చోటు చేసుకుంది. ఈక్విటిల్లో రూ.35,943 కోట్ల పెట్టుబడులు రాగా.. ఇందులో అక్టోబర్‌లో రూ.41,886 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.