6 నెలల్లో 20,000 యూనిట్లు అమ్ముడైన MG విండ్సర్!

నవతెలంగాణ హైదరాబాద్: MG విండ్సర్, భారతదేశపు ఉత్తమంగా అమ్ముడయ్యే EV మరొక గొప్ప మైలురాయిని సాధించిందని  JSW MG మోటార్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఇది విడుదలైన 6 నెలలు లోగా రికార్డ్ సమయంలో 20,000 యూనిట్లు అమ్ముడై ఇప్పుడు అత్యంత వేగవంతమైన EVగా ఇప్పుడు మారింది. MG విండ్సర్ మెట్రోస్ మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు నుండి ఒకే విధంగా సుస్థిరమైన అత్యధిక సేల్స్ ను పొందింది, EV విభాగంలో ఒక మార్గదర్శిగా మారింది.

ఈ సాధించిన మైలురాయి గురించి వ్యాఖ్యానిస్తూ, రాకేష్ సేన్, డైరెక్టర్ సేల్స్ & మార్కెటింగ్, JSW MG మోటార్ ఇండియా ఇలా అన్నారు, “ఇది విడుదలైన నాటి నుండి, MG విండ్సర్ తమ సాటిలేని విలువ ప్రతిపాదనతో  కారు బయ్యర్లకు ఆనందం కలిగించింది. కస్టమర్లు దాని ఆధునిక డిజైన్, సహజమైన టెక్ ఫీచర్లు, విశాలమైన కేబిన్ ను ప్రశంశించారు. ఇవన్నీ సుస్థిరమైన మరియు చవకైన డ్రైవింగ్ అనుభవంతో కలిసి వచ్చాయి. ఇంకా, MG విండ్సర్ తో, మేము కాటగిరి అడ్డంకులను మేము విజయవంతంగా పరిష్కరించాము మరియు మా వినూత్నమైన విధానం ద్వారా భారతదేశంలో EVలలో పలు అపోహలను తొలగించింది. ఇది EV జీవనశైలిని అనుసరించడానికి కొత్త కస్టమర్లకు వీలు కల్పించింది. ఈ అంశాలు రికార్డ్ సమయంలో 20,000 సేల్స్ మైలురాయిని సాధించడానికి అత్యంత వేగవంతమైన EV మోడల్ గా మారడానికి MG విండ్సర్ ను ప్రోత్సహించింది.

MG విండ్సర్, భారతదేశపు మొదటి ఇంటిలిజెంట్ CUV EV విభాగంలో మార్పులు కలిగించింది మరియు ఆటోమోటివ్ పరిశ్రమలో ఆధునిక అద్భుతంగా ఆవిర్భవించింది, సౌకర్యం, స్టైల్ మరియు టెక్నాలజీలను అందించింది. ప్రారంభపు BaaS ధర రూ. 9.99L+రూ 3.9/కిమీ+, ఈ CUV సిడాన్ వంటి విశాలమైన స్థలం మరియు SUV వంటి విలక్షణతలను కలిపింది. MG విండ్సర్ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్ తో లభిస్తోంది, 100 KW (136ps) పవర్ మరియు 200Nm టార్క్ అందిస్తోంది. CUV  సింగిల్ ఛార్జీతో  ప్రభావితపరిచే 332 km++ ARAIచే ధృవీకరించబడిన రేంజ్ ను అందిస్తోంది.
MG విండ్సర్ ఆధునిక ‘ఏరోగ్లైడ్’ డిజైన్ విధానంలో లభిస్తోంది, సంప్రదాయబద్ధమైన విభాగం భావనలో మార్పు కలిగించింది. కారు లోపల, ‘ఏరో లౌంజ్’ సీట్లు బిజినెస్ – తరగతికి చెందిన సౌకర్యాన్ని అందిస్తాయి. ఇవి 135 డిగ్రీల రిక్లైన్ తో అత్యంత సౌకర్యం అందిస్తాయి. ఇంకా,  కన్సోల్ పై భారీ 15.6” గ్రాండ్ వ్యూ టచ్ డిస్ ప్లే సహజమైన డ్రైవింగ్ అనుభవం ఇస్తుంది.

Spread the love