ఆటోను ఢీకొన్న మైనింగ్ లారీ.. ఆరుగురికి గాయాలు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఆటోను  మైనింగ్ లారీ ఢీకొన్న ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాన్సువాడ మండలం కోయగుట్ట తండా నుంచి పెళ్లిని కాయం చేసుకోవడం నిమిత్తం అమ్మాయి వాళ్ళ గ్రామం గాంధారి మండలం డప్పుతండాకు వచ్చికార్యక్రమం ముగించుకొని తిరిగి వెళుతుండగా సాయంత్రం  సమయంలో గాంధారిలో వ్యవసాయ మార్కెట్ వద్ద మూల మలుపు వద్ద ఆటోను వెనకనుంచి చద్మల్ వైపు నుంచి గాంధారి వైపు వస్తున్న మైనింగ్ లారీ ఢీకొట్టడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి  గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Spread the love