నవతెలంగాణ – భువనగిరి
తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు మండల పరిధిలోని దాచారం గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకులు నేపూరి ధర్మేందర్ రెడ్డి మాతృమూర్తి కీ”శే” శ్రీమతి నేపూరి పిచ్చమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో పరమపదించగా, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి పైళ్ళ శేఖర్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి , భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం , ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ,మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.