Tuesday, July 7, 2026
E-PAPER
Homeజిల్లాలురేపు వనపర్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక

రేపు వనపర్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తికి రానున్నట్లు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మంగళవరం ఒక ప్రకటనలోక తెలిపారు. వనపర్తి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 9:15 నిమిషాలకు రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం 9:30 గంటలకు 10 కోట్లతో చేపట్టనున్న పాలిటెక్నిక్ రాజ బంగ్లా పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. అనంతరం రేవల్లి మండల కాంప్లెక్స్ సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూరి గుడిసెలు ఉన్న నిరుపేదలకు 2వ విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రోసిడింగ్ కాపీలను అందజేస్తారన్నారు.

అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడెంట్ కాపీలను అందజేస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పట్టణాధ్యక్షులు, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, బి ఎల్ ఏ లు, సింగిల్ విండో అధ్యక్షులు ఉపాధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, జిల్లా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుబంధ సంఘాల నాయకులు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా సమైక్య సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్దలు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -