ఆదివాసీలపై కాల్పులు జరపొద్దు : మంత్రి సీతక్క

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణల విషయంలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై ఎట్టి పరిస్థితుల్లో ఫైరింగ్ చేయొద్దని అధికారులను ఆదేశించారు. శనివారం అటవీ అధికారులతో సమావేశమైన సీతక్క.. అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. పోడు పట్టాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూడాలన్నారు. అటవీ చట్టాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించాలని సూచించారు. చేతులు మారిన పోడు భూములపై విచారణ చేపడుతామన్నారు.

Spread the love