చేప పిల్లలను వదిలిన మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి

నవతెలంగాణ- మోపాల్

మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామ పరిధిలో గల మాసాని చెరువులో గురువారం రోజున ఆర్టీసీ చైర్మన్ నిజామబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాలతో కలిసి మత్స్య పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరం నుండి 100% రాయితీపై చేప పిల్లలను విడుదల ఉచితంగా పంపిణీ చేస్తుందని ,ఈ సంవత్సరం 2. 74 లక్షల చేప పిల్లలు మరియు 1.37 లక్షల రొయ్య పిల్లలను ఈ సంవత్సరంలో చెరువులో వదిలామని అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చక్ర వాహనాలను పంపిణీ చేయడం జరిగిందని అలాగే లగేజ్ ఆటోలకు 70% రాయితీపై పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఎన్నికల రాగానే బిచ్చగాళ్ళ మాదిరిగా కాంగ్రెస్ బిజెపి నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఎందుకు వచ్చి ఏవేవో అబద్దాల హామీలు ఇస్తారని వారి మాట అని ఓట్ల బిచ్చగాళ్లతో ప్రజల ప్రభుత్వం గా ఉండాలని ఎల్లవేళలా ప్రజలందరి శ్రేయస్సు కోరే కేసీఆర్ కడుపులో పెట్టి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గంగపుత్రులకు దళారుల బెడద లేకుండా ధనవంతులు అయ్యేలా ఈ చేప పిల్లల పెంపకం ఎంతగానో వారికి ఉపయోగపడుతుందని అలాగే దానితోపాటు ఫిష్ మార్కెట్లను నిర్మిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెంచుతున్నారని బాజిరెడ్డి కొనియాడారు  తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పసుపు బోర్డు పేరుతో అరవింద్ గెలిచిన కవిత ఓడిపోయిన కూడా ఈరోజుకి కూడా ఇందూరు ప్రజలను మర్చిపోలేదని ప్రతిక్షణం నిజామాబాద్ జిల్లా అభివృద్ధి గురించి ఆలోచిస్తుందని, ఇటువంటి గొప్ప నాయకురాలు నిజామాబాద్ జిల్లాకు దొరకడం నిజామాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టమని వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఓడగొట్టాలని ఆయనతో పలికారు, అలాగే 18 సంవత్సరాల నుండి ప్రతి గంగా పుత్ర యువత సొసైటీలో మెంబర్ గాచేరాలని సొసైటీలో సంకల్పించాలన్నారు చెరువులో వేసే చేప పిల్లలపై పూర్తహక్కు గంగపుత్రులకు మత్స్యకారులకే ఉంటుందన్నారు కాంట్రాక్టర్లు ఎన్ని చేప పిల్లలు వేస్తున్నారు ఎన్ని రొయ్యలు వేస్తున్నారు దగ్గరుండి చూసుకోవాలని ఇందులో గోల్మాల్ జరిగే అవకాశం ఉందన్నారాయణ, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు బాజిరెడ్డి గోవర్ధన్ పెద్దన్న లాంటివాడని లక్ష్మీ పుత్రుడని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత ఆర్టీసీ చైర్మన్గా ఆయన ఉన్న హయాంలోని 43,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులుగా మారారని ఈ బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదముద్ర వేసిందన్నారు సంపద సముద్రమంత పెంచిన కేసీఆర్ మనసు అందర్నీ సమంగా ఆర్థికంగా ఎదిగేలా చేసే సముద్రమంతటి మనసు అన్నారు నాలుగు పాయింట్ 50 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది చేప పిల్లల పెంపకం జరుగుతుందని ఆమె అన్నారు .అలాగే గంగపుత్రులను ఆదుకునేందుకు ఇదే విధంగా 100% సబ్సిడీతో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి జెడ్పిటిసి మరియు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, సాంబార్ మోహన్, న్యాల్కల్ సర్పంచ్ గంగ ప్రసాద్, జడ్పిటిసి కమల నరేష్ ఎంపీపీ లతా కన్నిరాం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, వివిధ గ్రామాల సర్పంచులు ముత్యంరెడ్డి, సిద్ధార్థ ,గంగాధర్, శ్రవణ్ పిఎసిఎస్ చైర్మన్లు చంద్రశేఖర్ రెడ్డి,  నిమ్మలమోహన్ రెడ్డి, ఉమాపతిరావు, తదితరులు పాల్గొన్నారు
Spread the love