
నాగర్ కర్నూల్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని శనివారం హైదరాబాదులో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించారు. అధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మల్లు రవి ని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోపతయ్య డీసీసీ ఉపాధ్యక్షులు కొయ్యల శ్రీనివాస్, భరత్ కుమార్ లు ఉన్నారు.