నవతెలంగాణ-ఆసిఫాబాద్
మండలంలో గల ఓ గ్రామంలో లైంగికదాడికి గురైన బాలిక కుటుంబాన్ని అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత బాలికకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియ చెల్లించాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందించాలన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు పెరిగి మద్యపానం సేవించే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో నేరాల సంఖ్య పెరుగుతుందన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ పరామర్శ
బాధిత బాలికను మాజీ ఎంపీపీ మల్లికార్జున్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికపై లైంగికదాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పెంటయ్య, గాజుల ప్రసాద్, సింగల్ విండో వైస్ చైర్మన్ ప్రహ్లాద్, సుబ్బారావు, మురళి, వినోద్, శ్రీనివాస్, లింగమూర్తి పాల్గొన్నారు.