దుర్గామాత సేవ మందిరానికి ఎమ్మెల్యే విరాళం అందజేత

నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని  దిర్శనపెళ్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న దుర్గా మాత సేవా మందిరానికి  తుంగతుర్తి  శాసనసభ సభ్యులు మందుల సామిల్ అందించే రూ.25 వేల రూపాయలను తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎఎంసి చైర్మన్ మాట్లాడుతూ  గ్రామాల  సమగ్ర అభివృద్ధి కోసం శాసనసభ సభ్యులు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  గ్రామ కాంగ్రెస్ పార్టీ పాండవుల లింగయ్య సీనియర్ నాయకులు అయోధ్య, అశోక్  దేవాలయం కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love