షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన (51)కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు  ముప్ప గంగారెడ్డి తో కలిసి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, చాలామంది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందవని వారు తెలిపారు. కానీ ఇంతకు ముందు ప్రభుత్వం లాగా కాకుండా సంక్షేమ పథకాలు నిరుపేదలందరికీ అందిస్తామని ఇంతకుముందు ప్రభుత్వంలో బిజెపి పార్టీ నాయకులకు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వారికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు విషయంలో చాలా ఇబ్బందులు పెట్టేవారు అని కానీ మన ప్రభుత్వం మన కర్షక ప్రభుత్వ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కచ్చితంగా పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, అలాగే ఆరు గ్యారెంటీ పథకాలను కూడా ప్రతి నిరుపేదకు అందే విధంగా చూస్తానని ఆయన తెలిపారు .ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలను అందుబాటులో తెచ్చామని మిగతా వాటిని అతి తొందరలో కూడా ప్రజలకు అందించే విధంగా చూస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం ఎక్కడ చూసినా అవినీతిమయమైందని కాలేశ్వరం ప్రాజెక్టు, అలాగే ప్రతి శాఖలో కూడా అప్పుల కుప్పలుగా చేశారని రాష్ట్ర విభజన తర్వాత బంగారు తెలంగాణ ఉంటే గత తోమ్మిదిన్నర   సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపు 5 లక్షల కోట్ల అప్పుల పాలయ్యామని, ఇంతకుముందు పాలించిన ప్రభుత్వం తెలంగాణలో మొత్తం అప్పులపాలు చేసి కేవలం ప్రజలను మోసం చేసి మభ్యపెట్టిందని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఇంతకుముందు ఎలక్షన్లు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని,  ముఖ్యంగా మన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని అతి త్వరలో రోడ్లకు మహర్దశ రాబోతుందని ఆ
Spread the love