
మండలంలోని ఆలూరు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం, మండల కేంద్రం తోపాటు కౌట్ల (బి)లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.రైతులు పండించిన పంటను ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాల్లోనే విక్రహించి ప్రభుత్వ మద్దతు ధర వరి క్వింటాలుకు మొదటి రకం రూ.2320/- రెండవ రకం రూ 2300/- , జొన్నలు క్వింటాలుకు రూ.3371 /- మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అయిర నారాయణ రెడ్డి, మార్కెట్ చైర్మన్ హాది, వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి,బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు నరేష్, నాయకులు రావుల రామ్ నాథ్, రామ్ శంకర్ రెడ్డి, చంద్ర ప్రకాష్ గౌడ్, సాయబ్ రావు, విలాస్, వీరయ్య, తిరుమల చారి, మధు, రాజు, నర్సయ్య, గణపతి, భోజాన్న, బీమాలింగం, తహశీల్దార్ శ్రీదేవి, ఏ.ఒ వికర్ హైమద్, సెక్రటరీ దుమనాయక్ సిఈఓ సలీం, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.