భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఏ సమస్య ఉన్న తమ దృ ష్టికి తీసుకురావాలని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ చేసీ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం వరి వేస్తే ఊరే అని అన్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతు వద్ద నుండి బియ్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు సన్నబియ్యాన్ని అందిస్తుందని ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. సన్న వడ్లకు రూ 500 బోనస్ ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, నాయకులు శ్రీనివాస్, పరమేశ్వర్ రెడ్డి, ఉడుత వేంకటేశ్ పాల్గొన్నారు.