జుక్కల్ లో అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని గుండూర్ గ్రామములో సోమవారం నాడు జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీ కాంతారావ్ స్థానిక సర్పంచ్ దేవిదాస్ తో కలిసి పలు ఆభివృద్ది పనులను ప్రారంబించారు. ఈ సంధర్భంగా గ్రామములోని అంగన్ వాడి నూతన భవనం వ్యయం రూ.9లక్షలు, పౌర సేవా కేంద్రం భవనం రూ.6లక్షలు, ప్రయాణ ప్రాంగణంరూ. 6లక్షలు రూర్బన్ నిధులతో ప్రారంబించారు . ఈ సంధర్భంగా ఎమ్మెలే ను గ్రామస్తులు ఘణంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపిడివో నరేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love