కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ – నవీపేట్
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలేశ్వర్, బినోల, ఆశాజ్యోతి కాలనీలలో ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. నిత్యవసర ధరలను మూడింతలు పెంచిందని ,ఏడాదికి లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎక్కడ కూడా నెరవేరలేదని, ఉపాధి హామీ పథకాన్ని రోజురోజుకు నీరు గార్చిందని, జిఎస్టి పేరుతో లక్షల కోట్లు పన్ను వసూలు చేస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమేనని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేస్తామని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. గతంలో  కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలో మరియు రోడ్లు వేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. కాబట్టి రాజకీయంగా అపార అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, శ్రీనివాస్ గౌడ్ రాజేందర్ కుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, రామ్ చందర్, బాలరాజ్ గౌడ్, బాబు, మూస, జబీర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love