గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు

Aim is to develop villages: MLA Tota Lakshmikanta Raoనవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
మండలంలోని వడ్లం గ్రామంలో సోమవారం రోజున  జుక్కల్ తోటా శాసన సభ్యులు తోట లక్ష్మీకాంతారావు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా భావించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పది సంవత్సరాలు పాలించిన గత పాలకులు గ్రామాలను అభివృద్ధి చేయలేకపోయారని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు విసిగిపోయి ప్రజల మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోకి అధికారంలోకి తెచ్చారన్నారు.వడ్లం గ్రామంలో ఐదు లక్షల వ్యయంతో ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల ద్వారా పనులు ప్రారంభించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి శామప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love