ఏర్గట్ల,నాగేంద్ర నగర్ గ్రామాల్లో బుధవారం పలు బాధిత కుటుంబాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. సాధుల శ్రీనివాస్ వాళ్ళ నాన్న చనిపోవడంతో బాధిత కుటుంబాన్ని, జిట్టవోయిన రాజు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని, పడకంటి గంగారెడ్డి వాళ్ళ అమ్మ చనిపోవడంతో వారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకుడు కనుగుర్తి గంగాధర్ చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని,నాగేంద్ర నగర్ గ్రామంలో చింతల సతీష్ వాళ్ళ నాన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని,జలీల్ చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇందులోభాగంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పూర్ణానందం,ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు నెరేళ్ళ లింగారెడ్డి,బద్దం ప్రభాకర్,రొక్కెడ మోహన్,బద్దం శ్యామ్,బద్దం హన్మాండ్లు,గడ్డం రమేష్,ఏలేటి బాలకిషన్,బాలాజీ గౌడ్,బద్రి కృష్ణ , కుర్మ శేఖర్ పాల్గొన్నారు.