సెంట్రల్ లైటింగ్, ఫోర్ వే లైన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి  ముప్పగంగారెడ్డి మరియు మండల అధ్యక్షుడు సాయి రెడ్డి తో కలిసి సెంట్రల్ లైటింగ్ కి మరియు నాలుగు వరుసల రోడ్డు అలాగే చిన్నాపూర్ నుండి కులాస్పూర్ కి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఎస్ టి ఎస్ డి ఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు  కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూరల్ నియోజకవర్గనికి మరియు ముఖ్యంగా మోపాల్ మండలానికి మహర్దశ ప్రారంభమైందని కచ్చితంగా అద్దెకు ఉంటున్న పోలీస్ స్టేషన్, ఎంపీడీవో ఆఫీస్ తాసిల్దార్ ఆఫీస్ లకు ప్రభుత్వ భవనాలన్నింటినీ అతి త్వరలో నిర్మిస్తామని ఇప్పటికే నియోజకవర్గానికి 100 కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి పయనంలో నడిపిస్తున్నాడు మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అని తెలిపాడు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ..  గత పది సంవత్సరాలు స్కూల్ భవనాలను పట్టించుకునే నాధుడే లేదని ఎలక్షన్ సమయంలో మనబడి కింద ఏదో తూతూ మంత్రంగా నిధులు తెచ్చి ప్రజలను మోసం చేశారని, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాడని, ఆదర్శ పాఠశాలల కింద 2000 కోట్ల నిధులు తో అన్ని స్కూలకు మరమ్మతులు చేయిస్తున్నాడని ఆయన తెలిపారు అలాగే ఆరు గ్యారెంటీలో అన్నింటిని అమలు చేస్తామని, ఆయన తెలిపారు.  అలాగే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అని, మెగా డీఎస్సీతో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు.
mla-who-laid-foundation-stone-for-central-lighting-four-way-lineఅలాగే యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఏర్పడే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా మంచిప్ప 21 ప్యాకేజ్ పనులను ఎత్తు పెంచకుండా పాత పనుల ప్రకారమే త్వరలో ప్రారంభిస్తామని మంచిప్ప గ్రామంతో పాటు మోపాల్ మండల ప్రజలందరికీ సాగు త్రాగునీరుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన తెలిపారు. కచ్చితంగా నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మరీ డబల్ బెడ్రూంలో ఇల్లన్ కూడా మంజూరు చేస్తామని కచ్చితంగా ఆగస్టు 15 తారీకు అండి రైతులకు రుణమాఫీ చేసి ఇది రైతు ప్రభుత్వం కర్షక ప్రభుత్వము నిరూపిస్తామని ఆయన తెలిపారు. మోపాల్ మండలం కేంద్రంగా కూడా నేను ఎమ్మెల్సీ ఉన్న సమయంలోనే కృషి చేశానని ఇది మండల గా ఏర్పడడానికి నేను ప్రధాన పాత్ర పోషించానని ఆయన తెలిపారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్గా ఉన్న సమయంలో 1500 పాత బస్సులను నమ్ముకుని బస్సుల కొరతను ఏర్పాటు చేశాడని అతి త్వరలో మరో 1500 బస్సులు కూడా ఎలక్ట్రిక రాబోతున్నాయని ప్రతి జిల్లా కేంద్రంలో  నలుమూలల కూడా బస్సులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని ఆయన గత ప్రభుత్వంగత ఎమ్మెల్యే ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేసినట్టు అన్ని ఫేక్ నిధులు ఇచ్చి ప్రజల మోసం చేశాడని కానీ మా ప్రభుత్వం అలా చేయదని చేసేదే చెప్తుంది చెప్పేదే చేస్తుందని ఆయన పదే పదే తెలియచేపరిచాడు. రానున్న రోజుల్లో ఇంకొన్ని నిధులు దశలవారీగా మంజూరు చేసి మోపాల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలికేట్ శేఖర్ గౌడ్, భాస్కర్ రెడ్డి ,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి,  ఎంపీపీ లతా కన్నీరాం, వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్, బాడ్సి సొసైటీ చైర్మన్  మోహన్ రెడ్డి,  మాజీ సర్పంచులు గంగా ప్రసాద్ ,జలంధర్ రెడ్డి, ఫిషరీస్ కమిటీ అధ్యక్షుడు  శ్రీనివాస్, సతీష్ రెడ్డి, సాయి కుమార్, సతీష్ రావు, ఎంపీడీవో లింగం నాయక్, పి ఆర్ ఏ ఈ స్రవంతి, మిషన్ భగీరథ ఈ వినయ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love