నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామి వారిని వేడుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.