– టీచర్ ఎమ్మెల్సీ 100 శాతం..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల అధికారులు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ లో పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ లో 100% ఓటరర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో 171 టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ లో 383,384 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ 383 లో 865 ఓట్లకు 446 మాత్రమే పొలవ్వగా,51.56 శాతం ఓటింగ్ నమోదు కాగా, పోలింగ్ బూత్ 384 లో 696 ఓట్లకు 349 మాత్రమే ఓట్లు పోలవగా 50.14 శాతం ఓటింగ్ నమోదయింది. పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళా ఓటర్లు తమ చంటి పిల్లలతో సహా పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.