
ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కన్వీనర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాక మహిళలను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాట పటిమగల ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ రాజకీయాలలో సైతం కీలక పాత్ర వహిస్తారని అన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు అబ్బన్న, తెడ్డు పోశెట్టి, గైని సతీష్, శ్యామ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.