సెంటినరీకాలనీలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – రామగిరి 
మండలంలోని సెంటినరీకాలనీలో బుధవారం జాగృతి అధ్యక్షురాలు మైదం స్వప్న ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత 46వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆరెస్, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కవిత మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, వైస్ ఎంపీపీ కాపురవేన శ్రీదేవి – భాస్కర్, నాయకులు నాగేల్లి సాంబయ్య, దేవ శ్రీనివాస్, మేడగోని రాజన్న, పింగిలి సంపత్ రెడ్డి, దాసరి మల్లేష్, కేశవరావ్, శ్రీకాంత్ రావు, సైండ్ల సత్యనారాయణ, మైదం సతీష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love