నేడు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

– హాజరుకానున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు హాజరుకానున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటాలో నవీన్‌రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం విదితమే.

Spread the love