ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్..

నవతెలంగాణ – చండూర్
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. డివిజన్ పరిధిలో 74.24 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. చండూరు మండల వ్యాప్తంగా  2472 పట్టభద్రుల ఓటర్లకు గాను 1802 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. పురుషులు 1592 గాను 1144 మంది ఓటుకు వినియోగించుకున్నారు.71.8%,  మహిళలు 880 గాను 658 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.74.7 % నమోదయింది. గట్టుప్పల్లో మొత్తం ఓటర్లు …722 ఓటర్ల గాను 561 మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారు.77.7% శాతం. పురుషులు 466 గాను 361మంది ఓటుకు వినియోగించుకున్నారు.77% శాతం. మహిళలు 256 గాను200 మంది ఓటు హక్కు  వినియోగించుకున్నారు.78% శాతం నమోదయింది. రాత్రికి బ్యాలెట్ బాక్స్ లను నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూం లకు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ప్రక్రియను తహశీల్దార్ దశరథ,సి ఐ వెంకటయ్య,ఎస్ ఐ సురేశ్ లు పర్యవేక్షించారు. కాగా జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరగనున్నది.

Spread the love