ఆళ్ళపల్లిలో ఎమ్మెల్సీ ఓటింగ్ శాతం 81%

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండలంలో స్త్రీలు 104 మంది, పురుషులు 133 మంది ఓటర్లు మొత్తం 237 మంది ఓటర్లు పట్టభద్రులు ఉన్న విషయం విదితమే. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మండల వ్యాప్తంగా పట్టభద్రులైన స్త్రీ పురుషులు మొత్తం 194 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అందులో స్త్రీలు 82 మంది, పురుషులు 112 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం మీద ఆళ్ళపల్లి మండలంలో ఎమ్మెల్సీ పోలింగ్ శాతం సుమారు 81.86గా నమోదైనట్లు ఎన్నికల ప్రత్యేక అధికారిని పి.పమేలా కుమారి(పి.ఓ) తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఆటంకం లేకుండా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్ల ఆరోగ్యం దృష్ట్యా వైద్యాధికారులు అర్వపల్లి రేవంత్, సంఘమిత్రలు అందుబాటులో ఉన్న మందులను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ నిర్వహణకు వచ్చిన అధికారులకు అవసరమైన ఆహారం, నీటి, తదితర సదుపాయాలను రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. అదేవిధంగా స్థానిక ఎంపీపీ, అక్షర సమిధ వ్యవస్థాపకులు కోండ్రు మంజు భార్గవి, వూకె కిశోర్ బాబు దంపతులు కుటుంబ సమేతంగా వచ్చి తమ ఎమ్మెల్సీ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Spread the love