రేవరేండ్ పాల్సన్ రాజ్ గారితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బుధవారం మండలంలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలో చేస్తున్న సందర్భంగా ఆయనను ప్రేమపూర్వకంగా కలుసుకొని ప్రత్యేక ప్రార్థనలను చేయించుకుని, ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో ప్రచారంలో ఉండగా విజయం సాధించేందుకు పాల్సన్ రాజ్, ప్రకాష్ రెడ్డి గార్లతో ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగిందని గుర్తు చేశారు. నేడు వారి ఆశీర్వాదాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రులు నామీద నమ్మకముతో ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుపును అందించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులకు సంబంధించిన విషయాలలో నా వంతు సహాయ సహకారాలను అందిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఇర్మియ, పట్టభద్రులు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.