నిజామాబాద్ పట్టణం లో గాంధీ చౌక్ ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై నిజామాబాద్ లో మాదిగలు సంతోషం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అలుపెరుగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగ అమరవీరులను వారి త్యాగాలను గుర్తు చేసుకుని స్వీట్లు, మిఠాయిలు పంచుకొని, నృత్య కార్యక్రమంలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు సరికేల పొశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, నిజామాబాద్ పట్టణం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్, జిల్లా ఉపధ్యక్షులు రోడ ప్రవీణ్ మాదిగ, నవీన్, యాదగిరి, గాజుల రాంచంధర్, శేఖర్,అశోక్, యమున, సత్యక,మహిళలు,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.