అమ్మ చెల్లెకు ఏమయింది..!

– టీ కా వికటించి పసికందు మృతి…
– పీహెచ్సీ ముందు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళన…
– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి…

– నేరెళ్లలో ఉద్రిక్తమైన వాతావరణం…
– నేరెళ్ల ఘటనను తలపిస్తున్న మరో ఘటన..

నవతెలంగాణ- తంగళ్ళపల్లి  : అమ్మ చెల్లెకు ఏమయిందే… ఎందుకు ఏడుస్తున్నారు.. అంటూ తొమ్మిదేళ్ల బాలుడు తన చెల్లెలు కోసం ఏడుస్తున్న రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. టీకా వికటించి 45రోజుల పసికందు మృతి చెందిన సంఘటన మండలంలోని నేరెళ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు  తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలితలకు కుమారుడు, 45 రోజుల కూతురు ఉన్నారు. రమేష్ కుటుంబ పోషణ కోసం పరాయి దేశం వెళ్లి తొమిది సంవత్సరాల తర్వాత సంవత్సరం క్రితం స్వదేశం తిరిగి వచ్చి కుటుంబంతో సంతోషంగా కడుపుతున్నాడు. ఈ తరుణంలో రమేష్ కు 45 రోజుల క్రితం ఆడపిల్ల జన్మించింది. కుటుంబమంతా సంతోషంగా ఉన్న సమయంలో బుధవారం పసిపాపకు టీకా వేయాలని ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం అందించారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పాపని తీసుకొని వెళ్లడంతో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది గ్రామానికి చెందిన ఏఎన్ఎం టీకాలు వేసిందని తెలిపారు. టీకా అనంతరం పాపకి జ్వరం వస్తుందని ఆ తర్వాత సిరప్ వేయమని చెప్పి ఇంటికి పంపించారని తెలిపారు. గంట తరువాత పాప కు జ్వరం బాగా రావడంతో సిరప్ వేశామని అయినా కూడా జ్వరం తగ్గకపోవడంతో సిరిసిల్ల ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో రైతులు పరీక్షించి పాప అప్పటికే మృతి చెందినట్లు ధ్రువేకరించాలని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పాపని తీసుకొని తిరిగి నేరళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి టీకా వికటించడం వల్లే పాపం మృతి చెందిందని ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించారు. దాదాపు మూడు గంటల పాటు బైఠాయించడంతో పోలీసులు మోహరించారు. నేరలలో మరోసారి ఉద్రిక్తమైన వాతావరణం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో నేరెళ్ల ఘటనను తలపించేలా వాతావరణం నెలకొంది. జిల్లా వైద్య అధికారిని రజిత సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి శివ పంచనామ రిపోర్టు ఆధారంగా కలెక్టర్కు నివేదిక అందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. పాపకు ఇచ్చిన వ్యాక్సిన్ లోనే మరో ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చామని వారు ఇద్దరు ఆరోగ్యకరంగానే ఉన్నారని వైద్యాధికారిని తెలిపింది. బాధితులు తమకు న్యాయం చేయాలని, న్యాయం చేసేంతవరకు ఇక్కడినుండి కదలమని బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత సతాయించిన బాధితులు వినకపోగా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేసేందుకు ప్రయత్నించగా డిఎస్పి సంఘటన చేరుకొని కుటుంబ సభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మాకు ఎలాగైనా న్యాయం జరగదని పసికందు తల్లిదండ్రులు పాపను ఆసుపత్రి వద్ద వదిలి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుండగా అప్పుడే వచ్చిన తాసిల్దార్ తల్లిదండ్రులతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ పాప కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్, వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని పాప మృతికి కారణం వైద్య సిబ్బందిని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాప తల్లిదండ్రులతో మాట్లాడి పాప మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే తక్షణ సహాయం కింద ప్రభుత్వం అందించే రూ.2 లక్షల చెక్కును పాప తండ్రి రమేష్ కు అందించారు.

Spread the love