– ఈపీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు
– సీబీటీ ప్రతిపాదన
న్యూఢిల్లీ : ఉద్యోగ, కార్మికుల ప్రావిడెండ్ ఫండ్ నిల్వలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కి గాను ఈపీఎఫ్‌పై 8 శాతం వడ్డీ ఇవ్వాలని ఇపిఎఫ్‌ఒ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ప్రతిపాదనలు చేసిందని సమాచారం. ఈ విషయమై శనివారం జరిగే సీబీటీి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అదే విధంగా స్టాక్ మార్కెట్లలో ఈపీఎఫ్ పెట్టుబడుల పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది. ఒకే వేళ అదే జరిగితే స్టాక్ మార్కెట్లలో ఎప్పుడైనా సంక్షోభం నెలకొంటే.. ఆరు కోట్ల మంది ఉద్యోగ, కార్మికుల సొమ్ము భద్రతపై నీలు నీడలు నెలకొననున్నాయి. నేడు జరగనున్న భేటీలో పీఎఫ్ ఖాతా నిల్వలపై వడ్డీరేటును 8 శాతం చెల్లించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదానికి పంపుతారని ఆ వర్గాలు తెలిపాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో 8.15 శాతం వడ్డీ చెల్లించారు. 1977-78లో అత్యల్పంగా 8 శాతం వడ్డీ అందించారు. ఆ తర్వాత ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి. 8 శాతం వడ్డీ రేటుపై సీబీటీ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదిస్తే ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది.