నవతెలంగాణ – కామారెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధికంగా మహిళా ఉపాధ్యాయులే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 13 07 మంది పురుష ఉపాధ్యాయులు ఉండగా అందులో 1216 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఉపాధ్యాయులు 704 ఉండగా 667 మంది మహిళా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పురుష ఉపాధ్యాయులు 93 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మహిళ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును 94.74 శాతం వినియోగించుకున్నారు. పట్టభద్రుల్లో పురుష ఓటర్లు 11616 కాగా 9127 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా పట్టభద్రులు 4793 కాగా 3693 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.