నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అంగన్వాడి కేంద్రాల్లో అందించే పౌష్టికరమైన ఆహారాలు గర్భిణి స్త్రీలు తీసుకుంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీసీ ఉమారాణి అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించారు. అనంతరం ఐసిడిసి ఉమారాణి మాట్లాడుతూ… గర్భంతో ఉన్న మహిళలు పౌష్టికరమైన ఆహారాలు తీసుకుంటే గర్భంలోని శిశువు పుట్టేటప్పుడు ఆరోగ్యంగా పుడతారని ఆమె తెలిపారు. అలాగే పుట్టిన పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల పద్మ, పుష్పలత, శారద,కళావతి పాల్గొన్నారు.