- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 80వ జన్మదినోత్సవం జూన్ 5వ తేదీన విశాఖపట్నంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ధర్మపురి కృష్ణమూర్తి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు హాజరవుతారు. గాయకుడు ధర్మపురి త్యాగరాజు ఇతర గాయని మనలతో కలిసి బాలు పాడిన ప్రసిద్ధ గీతాలను ఆలపిస్తారు. ద్వారకా నగర్ లోని పౌర గ్రంథాలయంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సినీ టీవీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ కు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పురస్కార ప్రధానం చేస్తారు.
- Advertisement -


