నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు కోసం ఉద్యమం  

– జూన్ 6వ తేదిన చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలో డివిజన్ మహాసభలను జయప్రదం చేయండి.
– NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
వికలాంగుల చట్టాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వo విఫలం చెందిందని, నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ సాధన కోసం ఉద్యమం చేస్తామని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ బుధవారం హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షలు తుంగ భూపాల్ రెడ్డి అధ్యక్షతన చౌటుప్పల్ మండలం కార్యాలయంలో జరిగింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 8 ఏండ్లు అవుతున్న నేటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు.చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యలకు ఎందుకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని చట్టంలో ఉందని,దాన్ని అమలు చేయడం లేదన్నారు,మెంటల్ హెల్త్ కేర్ చట్టం 2017 ను వెంటనే అమలు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక హోమ్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు.నేషనల్ ట్రస్ట్ ప్రకారం అంటీజం, సెరిబ్రల్ పాల్సి,వైకాల్యం కలిగిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అన్నారు.2016 RPD,నేషనల్ ట్రస్ట్ లకు చీఫ్ కమిషనర్స్ నియమించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 2011నుండి వికలాంగుల పెన్షన్ కేవలం 300 రూపాయలే ఇస్తున్నారని, నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్న పెన్షన్ ఎందుకు పెంచడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లగ్ పోస్తులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.రిజర్వేషన్స్ సాధన కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో డివిజన్ అధ్యక్షులు తుంగ భూపాల్ రెడ్డి డివిజన్ కార్యదర్శి ఏర్పుల శివయ్య జిల్లా నాయకులు బలుగూరి అంజయ్య,సంజీవ శంకర్,బర్ల పార్వతి,ఎస్ నర్సిరెడ్డి, పల్లెర్ల శైలజ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love