నవతెలంగాణ-హైదరాబాద్: వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగర్హి నిరసన వ్యక్తం చేశారు. వక్ప్ బిల్లు రద్దు చేయాలని ఫ్లకార్డు చేతబూని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు లోక్‌సభలో వక్ప్ బిల్లును పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణరిజిజు ప్రవేశపెట్టనున్నారు. క్వశ్చన్ ఆవర్ తర్వాత సభలో సదురు బిల్లును ప్రవేశపెట్టి…8గంటల పాటు వక్ఫ్ బిల్లుపై చర్చించనున్నారు. అదే విధంగా రాజ్యసభలో వక్ఫ్ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టానున్నారు.ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా అందరూ ఖచ్చితంగా పార్లమెంట్‌కు హాజరుకావాలని హుకం జారీ చేసింది. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా వక్ఫ్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం పొందకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఐక్యంగా ఉండి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను అడ్డుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.మరోవైపు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలుపున్నట్లు జనసేనపార్టీ పేర్కొంది. ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్